సిగ్మా తెలుగు డాట్, ఇన్ , న్యూస్: పాకిస్తాన్ లో 44 శాతం భూభాగం సుమారు 2 కోట్ల లోపు ప్రజలు ఉన్న బెలూచిస్తాన్ అనుకున్న ప్రకారమే నిన్న స్వతంత్ర దినోత్సవం సంబరాలు చేసుకొంది బలూచ్ విముక్తి ఉద్యమ నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు నిన్న ఆగస్టు 11వ తేదీని ‘రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్’ స్వాతంత్ర్య దినోత్సవం ను సాంప్రదాయ పద్ధతులను పాటిస్తూ జరుపుకొన్నారు.. దురంధర్ సినిమా లో పాటలు ఆతరహా బెలూచి సాంప్రదాయ నృత్యాలు తో యువత హోరెత్తించారు. తమ భూభాగంలో పాక్ జెండాలను అవనతం చేసి తమ ఇండ్లపైన ప్రభుత్వ కార్యాలయాలు పైన బెలూచి జాతీయ జెండాలను ఎగురువేశారు. వారి కొత్త రాజ్యాంగం ను, అమలులోకి తెచ్చారు. వీరి కార్యక్రమాల ప్రసారాలను అడ్డుకొనేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం ఇంటర్ నెట్ ను, మొబైల్ సేవలు నిలిపేసిందని మీడియా సమాచారం. అయితే ఈ స్వాతంత్ర్యాన్ని పాకిస్తాన్ లేదా ఐక్యరాజ్యసమితి గుర్తించలేదు. అయితే భారత్ , రష్యా , ఇజ్రాయిల్, ఆఫ్గనిస్తాన్ లు తమ సార్వభౌమత్వాన్ని. దేశాన్ని త్వరలో గుర్తిస్తాయని బెలూచీలు ఆశాభావము తో ఉన్నారు.
