సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం ఉదయం పాలకోడేరు మండలంలోని కోరుకొల్లు, మోగల్లు, పాలకోడేరు గ్రామాల్లో “వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్గార్ మరియు ఆజీవికా మిషన్ గ్రామీణ (VB-G RAM G) – పల్లె పండుగ 3.0” కార్యక్రమంలో భాగంగా రూ.74 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన సి.సి. రోడ్ల నిర్మాణ పనులకు శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులను మెరుగుపరచి, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులను నిరంతరం కొనసాగిస్తున్నామని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు.. ఈ కార్యక్రమంలో పాలకోడేరు సహకార బ్యాంకు చైర్మెన్ కొత్తపల్లి నాగరాజుతో పాటు స్థానిక కూటమి నేతలు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
