సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఊహించని రీతిలో దసరా కు రావాల్సిన వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్‌ నెం.47’ చిత్రం మరోసారి వాయిదా పడింది. ఇటీవల సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగిన రీతిలో అక్టోబర్ 9న రావాల్సిన ఈ సినిమా విడుదల ఆలస్యం కానుందని నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్‌ పెట్టి నేడు, సోమవారం ధ్రువీకరించారు. సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు.. నాలుగైదు రోజుల ముందు ఈ విషయం చెప్పినందుకు క్షమించమని కోరారు. ఎప్పుడొచ్చినా ఈ సినిమా వెంకీ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా ఉంటుందని నాగవంశీ అన్నారు.‘సోషల్ మీడియా ట్రోల్స్ కి భయపడుతున్నామని, అందుకే 100 శాతం అన్నీ పెర్ఫెక్ట్ గా రెడీ అయిన తర్వాతే మంచి పబ్లిసిటీ ప్రమోషన్ చేసి వెంకటేష్ విదేశాల నుండి వచ్చాక అన్ని తృప్తి చెందితేనే సినిమాని విడుదల చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *