సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు, మరియు జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి సంయుక్తంగా . పశ్చిమ గోదావరి జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన తల్లి బిడ్డ ఎక్స్‌ ప్రెస్‌’ 13 వాహనాలను భీమవరం ప్రభుత్వాసుపత్రిలో ప్రారంభించారు. వారు మాట్లాడుతూ .. హైరిస్క్‌ ప్రెగ్నెన్సీ కేసులు, రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు సురక్షిత రవాణా సేవలు కోసం ప్రత్యేకంగా వినియోగించుకోవాలన్నారు. 102 నెంబరుకు ఫోన్‌ చేసి తల్లిబిడ్డ సేవలను వినియోగించుకోవాలన్నారు. జిల్లాకు 13 వాహనాలు కేటాయించగా భీమవరం పరిసర ప్రాంతాలలో 10 వాహనాలు అందుబాటులో ఉంటాయని మిగతా , 3 వాహనాలు జిల్లాలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. కార్యక్రమంలో భీమవరం ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటి డైరెక్టర్లు, వైద్యులు, వైద్యశాఖాధికారులు, కూటమి నాయకులు, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *