సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రస్తుతం భీమవరంలోని చిన్నమిరంలో జిల్లా టిడిపి కార్యాలయం, కొనసాగుతున్న విషయం తెలిసిందే.. అయితే పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయానికి ఆగస్టు 14వ తేదీ ఉదయం 9:30 గంటలకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, పోలిట్ బ్యూరో సభ్యులు, ఏపీఐసీసీ చైర్మన్ మంతెన రామరాజు తెలిపారు. టిడిపి నూతన జిల్లా కార్యాలయాన్ని బీవీ రాజు కాలేజీ దాటిన తర్వాత గొల్లలకోడేరు గ్రామం తాడేపల్లిగూడెం రోడ్డు ప్రక్కన నిర్మించనున్నామని శంకుస్థాపన కార్యక్రమానికి జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్, ఇరిగేషన్ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు, జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జులు, జిల్లా టిడిపి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *