సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: శుభకార్యాలకు ఆహ్వానం పలుకుతూ .. శ్రీ లక్ష్మీ దేవిని పూజించే శుభకరమైన శ్రావణమాసం నేడు,గురువారం నుంచి ప్రారంభమయ్యింది. నేడు, శ్రీ సాయి బాబావారి మందిరాలలో పాటు భీమవరంలోని అన్ని ఆలయాలు భక్తులతో ఆధ్యాత్మిక శోభ ను సంతరించుకొన్నాయి. కొబ్బరి కాయలు పూలు, పూజాసామాగ్రి దుకాణాలకు డిమాండ్ పెరిగింది. చాంద్రమాస ప్రకారం.. శ్రావణ మాసం 5వ నెలగా పరిగణిస్తారు. పౌర్ణమి చంద్రుడు శ్రవణ నక్షత్రం సమీపంలో సంచరిస్తున్నందున శ్రావణ మాసం అనే పేరు వచ్చిందని పండితులు చెబుతున్నారు. భీమవరంలో సాక్షత్తు చంద్రుని ప్రతిష్టగా పురాణాలూ పేర్కొంటున్న పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి దేవాలయంలో దర్శనాలు మరింత ఫలవంతం అవుతాయని ప్రతీతి. ఈమాసంలో ప్రతి ఇంట మహిళలు పూజలు, వ్రతాలతో మహిళలు పనులలో నిమగ్నమవుతారు. ఈ మాసంలో శివపార్వతులకు, శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈనెలలో వచ్చే మంగళ, శుక్ర, శనివారాలు అత్యంత పుణ్యప్రదమైనవిగా భావిస్తారు.
