సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పీ రాజధాని అమరావతి లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నేడు, . సీడ్ యాక్సెస్ రోడ్డు రెండో దశను, బకింగ్‌హామ్ కెనాల్‌పై స్టీల్ బ్రిడ్జిని నేడు, గురువారం ఉదయం ప్రారంభించారు.. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణంలో నేడు, కీలక నిర్మాణాలు ప్రారంభం అయ్యాయని ఈ నూతన సీడ్ యాక్సెస్ రోడ్డుతో అమరావతికి కనెక్టివిటీ పెరగనుందని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తరువాత రాజధాని లేకపోతే మనం ఏమీ చేయలేమని గ్రహించానని తెలిపారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన అమరావతి రైతులకు పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. ఆనాడు అమెరికాలో పర్యటించి.. హైదరాబాద్ లో సైబరాబాద్ రూపకల్పన చేశామని ప్రస్తావించారు ఆనాడు సైబరాబాద్‌ను నిర్మించామని చెప్పారు. హైదరాబాద్‌ ఆదాయం పెరగడానికి తాను చేసిన అభివృద్ధే కారణమని పేర్కొన్నారు.తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచిందని పేర్కొన్నారు.ఇక్కడ కూడా సింగపూర్ మోడల్‌తో అమరావతిని నిర్మిస్తున్నామని వ్యాఖ్యానించారు. ప్రజల నిర్ణయం మేరకే రాజధాని అమరావతి నిర్ణయం తీసుకున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *