సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు సంబంధించి తాజా గా బ్యాంకు రుణాల కోసం కొత్త వేళుసుబాటు ఇచ్చింది. తొలిసారి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఈ నిబంధనను పక్కన పెట్టి రుణాలు మంజూరు చేసేందుకు ముందుకొచ్చింది. బ్యాంకులు డ్వాక్రా సంఘాలకు రుణం ఇవ్వాలంటే కచ్చితంగా గ్రూపులో 10మంది సభ్యులు ఉండాలని ఎన్‌ఆర్‌ఎల్‌ఎం నిబంధన ఉంది. చాలా సందర్భాల్లో రుణాలు దుర్వినియోగం అవుతున్న కేసులు బయట పడటంతో ఏపీ ప్రభుత్వం పారదర్శక విధానాలు తీసుకొచ్చింది. అలాగే 10 మంది కంటే తక్కువ సభ్యులున్నా.. 8మంది మాత్రమే సభ్యులు ఉన్నపటికీ సబ్సిడీ వడ్డీ పై బ్యాంకులు రుణాల మంజూరు చేసేలా ఆదేశాలు ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *