సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అంబెడ్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం మండలం అనాతవరం వద్ద నేడు, శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక్కడికి సమీపంలోని అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి చెందిన నలుగురు వైద్య విద్యార్థులు..వారు కాకినాడ నుంచి అమలాపురం వెళ్లేందుకు మహీంద్రా ఎక్స్‌యూవీ 700 వాహనంలో బయలుదేరారు. అయితే గమ్యం సమీపిస్తుండగా అనాతవరం వద్ద కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గుంటూరుకు చెందిన వైద్య విద్యార్థి అల్లం జయసూర్య(30) అక్కడికక్కడే మృతి చెందాడు.మిగిలిన ముగ్గరు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
