సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల కాలంలో వర్షాలు లేకపోవడం ఈ ఏడాది దిగుబడి తక్కువ వస్తుందన్న ప్రచారంతో రికార్డు స్థాయిలో రిటైల్ షాప్ లలో మధ్య తరగతి ప్రజలు ఎక్కువ గా వినియోగించే సన్నబియ్యం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఆర్‌ఎన్‌ఆర్‌, హెచ్‌ఎంటీ , సాధారణ సన్నరకాలతో పాటు అతి సన్నరకాలైన జైశ్రీరాం బియ్యం ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఈ రెండు నెలల వ్యవధిలో క్వింటాకు 600 నుండి రూ.800 చొప్పున పెరగడం గమనార్హం. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌షాపుల్లో సన్నబియ్యం కాస్త తక్కువ ధరకు పంపిణీ చేస్తున్నప్పటికీ, అవి కేవలం 10 కేజీలు చప్పున మాత్రమే కావడంతో ఎక్కువ మంది ప్రజలు తమకు కావలసిన బియ్యం ప్రైవేటు షాపుల్లో బియ్యం కొనుగోలు చేస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే.. సన్న బియ్యలు ఏ బ్రాండ్ అయినా సరే..మార్కెట్ లో 26 కేజీల బస్తాలు ఎక్కువ వినియోగంలో ఉంటాయి. గత 2 నెలలుగా ప్రతి వినియోగ దారుడు తాము గతంలో చెల్లిస్తున్న ధర కంటే 200 రూపాయలు పైనే అధికంగా చెల్లించవలసి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఈ అడ్డు అదుపు లేని పెరుగుదలను కట్టడి చెయ్యవలసిన అవసరం ఉంది. ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో ధాన్యం సరఫరా ఉండబోదనే అంచనాలతో రైతులు పంటకు వినియోగించే వడ్ల ధరలు కూడా మార్కెట్లో విపరీతంగా పెరుగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *