సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం ఉదయం భీమవరం పట్టణ శివారు బివి రాజు కాలేజీ రోడ్డు లో తెలుగుదేశం పార్టీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు ఆధ్వర్యంలో నిర్మిస్తున్నా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా టీడీపీ ప్రజా ప్రతినిధులు. క్యాడర్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామా కృష్ణంరాజు ,భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ తోట సీతారామలక్ష్మి, మాజీ మంత్రి పీతల సుజాత తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, తాడేపల్లిగూడెం టీడీపీ ఇంచార్జ్ వలవల బాబ్జి తదితర నేతలు భూమి పూజలో పాల్గొన్నారు.
