సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: . భీమవరంలో 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను దంతులూరి నారాయణరాజు కళాశాల క్రీడా ప్రాంగణంలో పాలకవర్గ అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహ రాజు అద్యక్షతన అత్యంత వైభవం గా జరిగాయి. ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి యస్.సి.సి కేడెట్లు, కళాశాల అసోసియేషన్ అనుబంధ సంస్థల విద్యార్ధినీ విద్యార్ధుల గౌరవ వందనాన్ని స్వీకరించారని కళాశాల ప్రిన్సిపాల్ జి.మోజెస్ తెలిపారు.. డి.యన్.ఆర్ కళాశాల అసోసియేషన్ లో ఉన్న అన్ని విద్యాసంస్థల సిబ్బంది మరియు విద్యార్థులు ఈ వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల పాలకవర్గ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు మాట్లాడుతూ.. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న వారు తమ ప్రాణాలను సహితం ఫణంగా పెట్టారని వారు ఎప్పుడూ తమ ఉద్యమ భాటలో వెన్ను చూపకుండా ముందడుగు వేస్తూ సాతంత్ర్యాన్ని సాధించటం జరిగిందన్నారు. వారి త్యాగాలను మనం ఎప్పుడూ మరచి పోకూడదని అన్నారు.భారత దేశ సమగ్రతకు వాటిల్లే ఏ చర్యలనైనా భారత్ ఉపేక్షించరాదనీ, నేటి భారత ప్రభుత్వం ఈ విషయం లో చాలా చాకచక్యం గా వ్యవహరించటం ఉదహరించారు. కళాశాల పాలకవర్గ వైస్ ప్రెసిడెంట్ శ్రీ గోకరాజు పాండురంగరాజు విద్యార్థులు, అధ్యాపక సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు విద్యార్థిని విద్యార్థులు దేశభక్తి ని ప్రేరేపించే కార్యక్రమాలు నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *