సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని భీమవరంలో వాడవాడలా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో భీమవరంలో శశి వారి ఆధ్వర్యంలో మెంటేవారి తోటలో బై పాస్ వద్ద ఇటీవల ప్రారంభించిన ‘వేదం’ స్కూల్ ఆవరణలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను గత ఆదివారం ఘనంగా నిర్వహించారు., ఉదయం జాతీయ పతాకావిష్కరణతో ప్రారంభమైంది. పాఠశాల ఇంచార్జి దొర బాబు , ప్రిన్సిపాల్ ప్రసాద్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం విద్యార్థులు దేశభక్తి గీతాలు, దేశభక్తి నృత్యాలు, ప్రసంగాలతో సభికులను అలరించారు.పిరమిడ్స్, ఏరోబిక్ డ్యాన్స్ మరియు స్వాతంత్ర్య సమరయోధులు మరియు జాతీయ నాయకుల వేషధారణలతో చేసిన ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి.. ఈ కార్యక్రమంలో శశి జూనియర్ కళాశాల ఇంచార్జ్ ఏ. రవికుమార్ మరియు పాఠశాల ఉప ప్రిన్సిపాల్ లక్ష్మి , డాక్టర్. జి.సుబ్బరాజు హాజరయ్యారు.
