సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: న్యూఢిల్లీలోని అశోకా రోడ్, నంబర్ 15లో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అధికారిక నివాసంలో సీఆర్పీఎఫ్ వీర జవాన్లతో కలిసి గత శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతంతో పాటు ‘వందేమాతరం’ పూర్తి గీతాన్ని సగర్వంగా ఆలపించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ… స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని, వారి ఆశయాలకు అనుగుణంగా దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. ‘వికసిత్ భారత్–2047’ లక్ష్య సాధన దిశగా దేశం వేగంగా అడుగులు వేస్తోందని, ఈ మహత్తర సంకల్పాన్ని సాకారం చేయడంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని కోరారు.
