సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్; భీమవరం పట్టణం సమీపంలోని పాలకోడేరు మం డలం వేండ్ర గ్రామం లో విషదం చోటు చేసుకొంది భీమవరం లోని SRKR ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు గత ఆదివారం మధ్యాహ్నం ఈత కొట్టేందుకు వేండ్రలోని పంటకాలువ లోకి ముందుగా . ముగ్గురు యువకులు కాలువలోకి దిగగా నీటి వడికి అందులో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఒకరిని మాత్రం మిగతా నలుగురు అతి కష్టం మీద రక్షించినట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి గల్లంతయిన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలను వెలికితీశారు. మృ తులు భీమవరంలోని గునుపూడికి చెందిన పెరుమల్ల విగ్నే ష్(22), మరొకరు పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన శ్రీతు రాహుల్ (21)గా గుర్తించారు. నిన్న ఆదివారం తణుకు దగ్గర కారు కాల్వలో కి వెళ్లిన ప్రమాదంలో 5 గురు భీమవరంలో ఇద్దరు కల్పి జిల్లాలో మొత్తం 7 గురు ఇంజనీరింగ్ విద్యార్థులు మరణించడం వారి బంగారు భవిషత్తు ఉహించుకొన్న వారి తల్లి తండ్రులకు తీవ్ర విషాదాన్నీ మిగిల్చింది.
