సిగ్మా తెలుగు డాట్, న్యూస్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి వర్షాకాల సమావేశాలు నేటి గురువారం తో ముగుస్తున్నాయి. కేవలం 4 రోజులు మాత్రమే సమావేశాలు జరగటం గమనార్హం. శాసన సభలో ఈసారి కూడా వైసీపీ తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు నిరసనగా సభకు హాజరు కాకపోవడంతో అసెంబ్లీ సమావేశాలు కూటమి ఎమెల్య ల సదస్సు మాదిరి చప్పగా నడిచాయి. ఇక శాసనమండలి మాత్రం హోరాహోరీగా నడిచినప్పటికీ ఈ నాలుగు రోజులు వైసీపీ ఎమ్మెల్సీ లు DSC కుంభకోణం, మంత్రి లోకేష్ రాజీనామా లపై పెద్ద ఎత్తున డిమాండ్ చెయ్యడానికి సమయం కేటాయించడంతో ఇతర ‘ప్రజా సమస్యలు’ పెద్దగా చర్చకు రాలేదు. ఏ కారణం చేతనో మంత్రి లోకేష్ మండలి లో ఈసారి కాస్త సబ్దు గా ఉన్నారు. మండలి వైస్ చైర్మెన్ పదవి కూడా వైసీపీ అభ్యర్థి దక్కించుకోవడం గమనార్హం. నేటి ఆఖరి రోజు సమావేశాలలో ఇటీవల మృతిచెందిన మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు,మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ముద్రగడ పద్మనాభం, జీఎస్ రావు. టి.చిన్నరాజన్, హనుమంత రాయ చౌదరి, ఆర్‌ఎస్‌డీపీ అప్పలనరసింహరాజు, సుక్క పగడాలమ్మ, గాదె వెంకటరెడ్డి, లకు శాసనసభ సంతాపం తెలిపారు.
