సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేపాల్‌ను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా రసువా జిల్లాలో పలు గ్రామాలు కొట్టుకుపోయాయి. వరదల కారణంగా వేలాదిమంది గల్లంతయ్యారు. దాదాపు ఆరువేల మంది గల్లంతైనట్టు తెలుస్తోంది. 384 మంది టూరిస్టులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 105 మంది భారతీయులు కూడా ఉన్నారు. మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 400 మంది గల్లంతయ్యారు. వారిలో 31 మంది భారతీయులు ఉన్నారు. అక్కడి పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. వరదలతో ప్రజలు అతలాకుతలమయ్యారు. ఈ క్రమంలో నేపాల్ ప్రధాని బాలెన్‌షాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేసి అదుకొంటామని భరోసా ఇచ్చారు.. నేపాల్‌కు సహాయక సామాగ్రిని ఎయిర్‌ఫోర్స్ విమానాలతో పాటు , C-130 రవాణా విమానాల్లో రిలీఫ్ మెటీరియల్‌ను పంపిస్తున్నారు.
