సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం భీమవరంలో రాఖి పౌర్ణమి పండుగ. నేపథ్యంలో సోదర సోదరీమణుల మధ్య ప్రేమ, అనురాగం, ఆప్యాయతకు గుర్తుగా, తన సోదరుని రక్షణ కోసం రక్షాబంధన్ ఘనంగా జరుపుకొన్నారు. రాఖీలు అమ్మేవారికి , పండ్లు, స్వీట్స్, గిఫ్ట్స్ దుకాణాలు కు మంచి గిరాకీ ఏర్పడింది.. ఈ పవిత్రమైన రోజున అక్కాచెల్లెళ్లు తమ సోదరుల చేతికి రాఖీ కడతారు. స్వీట్లు తినిపించి ఆశీర్వాదాలు తీసుకొన్నారు.. ఈ క్రమంలో సోదరీమణులకు జీవిత పర్యంతము ఏ సమస్య వచ్చిన తాము అండగా ఉంటామని అన్నాతమ్ముళ్లు వాగ్దానం చేసారు.. సోదరులు తమ అక్కాచెల్లెళ్లకు విలువైన బహుమతులు ఇచ్చి వారిపట్ల తమ ప్రేమను చాటుకున్నారు. సోదరి మణులు సోదరులకు హారతులు ఇచ్చి మిఠాయిలు తమ చేతితో తినిపించారు.. నేడు శ్రావణ పౌర్ణమి కూడా కావడంతో భీమవరంలోని అన్ని ప్రముఖ దేవాలయాలలో పండితులు దేవాలయాలలో యజ్ఞ యాగాదులు నిర్వహించారు.
