సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసమే ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని భీమవరం లో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్నామని టిడిపి రాష్ట్ర మాజీ కోశాధికారి మెంటే పార్ధసారధి, అన్నారు. భీమవరం టిడిపి కార్యాలయంలో నేడు శుక్రవారం ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తాగునీరు, రోడ్లు, పింఛన్లు, ప్రభుత్వ పథకాలు, తదితర సమస్యలపై ప్రజల నుండి అర్జీలను అందుకొన్నారు.. ఆయన మాట్లాడుతూ, ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేస్తే సంబంధిత అధికారికి ఇచ్చి పరిష్కరించేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ కలిదిండి సుజాత, కార్పొరేషన్ డైరెక్టర్లు గంటా త్రిమూర్తులు,ఉప్పులూరి చంద్రశేఖర్ టీడీపీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్ ఇందుకూరి రామలింగరాజు.వీరవాసరం మండల కార్యదర్శి వీరవల్లి శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్ విజ్జురోతు రాఘవులు టితదితర నేతలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *