సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మ అమ్మవారు దేవస్థానం వద్ద శ్రావణ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.. పౌర్ణమి సందర్భంగా జరిపే చండీహోమం కార్యక్రమం ఆలయ అర్చకులు వేదపండితులు నిర్వహించారు 99 మంది దంపతులు ఈ హోమంలో పాల్గొన్నారని దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలియచేసారు.. ప్రజా క్షేమం కొరకు.. పాడి పంటలు, వ్యాపారం వృద్ధి.. ఆరోగ్య భాగ్యం, సంపద వృద్ధి కొరకు సంకల్పంతో.. దేవస్థానం ఉత్సవ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 18 చేతులతో అనగా అష్టబుజ శ్రీ మహాలక్ష్మి ఉత్సవ మూర్తి..ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది.ఈ మూర్తి చుట్టూ నవ కళశాలను వివిధ దేవతా మూర్తుల ముద్రలతో చేసిన ఏర్పాటు పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేశారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *