సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో పవిత్ర పంచరామ క్షేత్రమైన భీమవరం శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం వద్ద నేడు, ఆదివారం శ్రీ పార్వతి, శ్రీ అన్నపూర్ణ అమ్మవారికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా సుమారు 5000 కేజీల మిఠాయి తో పసుపు కుంకుమ గాజులు వస్త్రాలతో శ్రావణ మాస పట్టి (సారే) ను స్థానిక భక్తులు అందించారు. ఈ శ్రావణ మాస పట్టి ఊరేగింపును శోభా యాత్రగా ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. శివుడు పరమాత్మ తత్త్వానికి ప్రతీక అని, పార్వతీ దేవి శక్తి స్వరూపిణి అని, ఇద్దరూ కలిసి శివశక్తి ఐక్యంగా విశ్వం నడిపే దైవ దంపతులన్నారు. వందలాది మంది భక్తులు సుమారు 5000 కేజీల శ్రావణ మాస పట్టిను అందించడం శుభ పరిణామమని ఆయన అన్నారు. అనంతరం శ్రీ సోమేశ్వర ఆలయం నుంచి గుడి చుట్టూ ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో, రామకృష్ణంరాజు ధర్మకర్తల మండలి సభ్యులు,చైర్మన్ బంగార్రాజు ,పట్టణ ప్రముఖులు, మహిళలు విశేషముగా పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *