సిగ్మా తెలుగు డాట్ ఇన్ న్యూస్: గల్ఫ్ లో మరోసారి ఇరాన్ అమెరికా ల మధ్య యుద్ధభేరి మ్రోగింది. గత మంగళవారం రాత్రి అమెరికా దాడులు చేయడంతో ఇరాన్ కూడా గల్ఫ్ దేశాలలోని అమెరికా సైనిక క్యాంపులఫై ప్రతీకార దాడులకు దిగింది. ఇరాక్, జోర్డాన్‌పై ఇరాన్ ప్రత్యేక సైనిక దళం ఐఆర్జీసీ దాడి చేసింది. కువైత్, బహ్రెయిన్‌లో కూడా పేలుళ్లు సంభవించాయి. ఇరాన్ లోని సిరిక్ ప్రాంతంలో అమెరికా దాడి వల్ల ఓ పెళ్లి సంబరాలు జరుగుతున్న గృహంలో విషాదం సంభవించిందని ఇరాన్ మీడియా పేర్కొంది. ఓ చిన్నారి సహా నలుగురు మృతి చెందారని, 50 మంది గాయపడ్డారని తెలిపింది.ఈ ఉదంతంపై ఇరాన్ సుప్రీం లీడర్ మండిపడ్డారు. యూఎస్‌కు తమ సైన్యం మర్చిపోలేని గుణపాఠం చెబుతుందని ఐఆర్జీసీ ప్రతినిధి హుస్సేన్ మొహబి పేర్కొన్నారు. ఈ దాడులు ఎందుకు చేశామా? అని చింతించేలా చేస్తామని హెచ్చరించారు. అయితే, హోర్ముజ్‌లో కమర్షియల్ నౌకలపై ఇరాన్ దాడి చేసే ప్రయత్నం చేయడంతోనే తాము దాడులు చేయాల్సి వచ్చిందని యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి నేటి బుధవారం తెల్లవారుజాము వరకూ దాడులు కొనసాగాయని పేర్కొంది
