సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ లో వై ఎస్ జగన్ సారథ్యంలోని వైసీపీ పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ ఎస్ పార్టీతో కల్సి పొత్తుతో అడుగుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు పెద్ద ఎత్తున హల్చల్ చేస్తున్నారు. తాజా పరిణామాలు కూడా ఆ దిశగానే సంకేతాలు ఇస్తున్నాయి. సుమారు 3 ఏళ్ళు పాలన పూర్తీ చేసుకొంటున్న కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి తో ఇప్పటికి దివంగత మాజీ సీఎం వై ఎస్ రాజశేఖర్ రెడ్డి అనుచరగణం గా , జగన్ కు సానుభూతిపరులుగా పేరుపొందిన తెలంగాణ కాంగ్రెస్ నేతలుకు వివాదాలు పెరిగిపోయి అధికార పార్టీకి దూరం జరుగుతున్నారు. దీనితో ‘ప్లాన్ బి’ ఏదైనా ఉందా అన్న చర్చ నడుస్తోంది. ఇటీవల జీవన్ రెడ్డి పార్టీనుండి బయటకు వెళ్ళాక, సీఎం రేవంత్ రెడ్డి తో కోమటి రెడ్డి బ్రదర్స్, చిన్నారెడ్డి ,కొండా సురేఖ ల మధ్య వివాదాలు రచ్చకెక్కయి. తాజగా ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం ముందు మంత్రి కొండా సురేఖ తన వైఖరి కుండబ్రద్దలు కొట్టారు. తన కూతురు వ్యాఖ్యలకు, తనకు సంబంధం లేదని, పదేళ్ల పాటు తానే సీఎంగా కొనసాగుతానంటూ రేవంత్‌రెడ్డి ఎలా చెబుతారని ప్రశ్నించారు. దీనితో ‘ప్లాన్ బి’? ఏదైనా ఉందా అన్న చర్చ నడుస్తోంది. మరో వైపు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డివర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో (తెలంగాణ వైసీపీ పార్టీకి అడ్జక్షుడుగా జగన్ నియమిస్తారని ప్రచార వార్తలలో ఉన్న.. )మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి,రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ..బయటి పార్టీ ( టీడీపీ?) నుంచి వచ్చిన వాళ్లు కాంగ్రెస్ పార్టీని కబ్జా చేయాలని చూస్తున్నారని.. తెలంగాణలో మళ్లీ వైఎ్‌సఆర్ పాలన తీసుకు వస్తామని సంచలన వ్యాఖ్యలు చేసారు.. మొత్తానికి ఆంధ్ర తరహాలోనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా త్వరలో జగన్ సారధ్యంలోని వైసీపీ అదుపులోకి వెళ్లి పొందుందని విశ్లేషకుల అంచనాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. తనను జైలు పాలుచేసి తన కుటుంబాన్ని తనకు దూరం చేసిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణాలో కూడా జగన్ క్షమించే ప్రశ్న లేదు అని ఆయన అభిమానుల వాదన.. ఇప్పటికి తెలంగాణలో ‘జగన్’ రోడ్డుమీదకు వస్తే రోడ్లు అభిమానులతో కిక్కిరిసిపోతున్నాయి. ఇప్పటికే కేటీఆర్ జగన్ ఫ్లెక్సీలు, కట్ అవుట్ లు తెలంగాణలో బిఆర్ ఎస్ శ్రేణులు, ఎమ్మెల్యేలు కూడా జగన్ కు స్వాగత ద్వారాలు కడుతున్నారు. ఆ అభిమానాన్ని ఓట్ల రూపంలో మలిచి బిఆర్ ఎస్ తో పొత్తు చేసుకొంటే.. తెలంగాణ లో వచ్చే ఎన్నికలలో రాజకీయ అద్భుతం జరుగుతుందని పలువురి విశ్లేషకుల అంచనా! ఇక తెలంగాణ లో అధికార పాగా వెయ్యాలని లక్ష్యంగా పెట్టుకొన్న బీజేపీ... టీడీపీ, జనసేన కూడా ఈ పరిణామాలు గమనిస్తున్నాయి… సిగ్మా ప్రసాద్ కాలమ్స్
