సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేవుని సేవలో దేవాలయంలో ఉద్యోగం వస్తే ఎంతటి అదృష్టం .. మరి దేవాలయానికే శఠగోపురం పెట్టె ‘స్వార్ధ పరులు’ వారి వెనుక ‘పెద్దలు’ ఎందరు లేరు?.. అయితే దొరికితే కానీ దొంగలు కాదు.. దొరకనివారు ఎందరో? మరి కలియుగ వైకుంఠంగా బాసిల్లు తున్న తిరుమల తిరుపతిలో టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథంను ఏసీబీ అధికారులు నేడు, గురువారం అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో లోకనాథంను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఏసీబీ కార్యాలయానికి తరలించారు. నిన్న(బుధవారం) లోకనాథం నివాసంతోపాటు బంధువుల ఇళ్లలోనూ ఐదు బృందాలుగా ఏర్పడి సోదాలు చేపట్టారు.ఈ దాడుల్లో సుమారు రూ.5 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను ఏసీబీ గుర్తించింది. 2 కిలోల బంగారం, 6.5 కిలోల వెండి, రూ.12.50 లక్షల నగదు లభ్యమైంది. భార్య, కుమారుడి పేర్లతో ఇళ్లు, స్థలాలు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది.
