సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అధునాతన EOS-05 ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన GSLV-F17 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్లో రెండో ప్రయోగ వేదికపై నుంచి ఎఫ్-17 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. అంతరిక్షం నుండి భూమిపై ఏ ప్రాంతము ఫై నున్న దృశ్యాన్ని మరింత స్పష్టంగా, నిరంతరం నిఘా పెట్టి పరిశీలించేందుకు ఈవోఎస్-05 శాటిలైట్ ను నింగిలోకి విజయవంతంగా పంపించారు. దీనితో భారత్ కు ఎన్నో ప్రయోజనాలు, మరింత రక్షణ కలగనున్నాయి. ఇస్రో శ్రాస్త్రవేతలను ప్రధాని మోడీ అబినందించారు.
