సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణ ప్రజల ఇలవేల్పు, ఆరాధ్యదైవమైన శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం ఆవరణలో అలనాటి గోకులం ను తలపించేలా గత రాత్రి శ్రీ కృష్ణాష్టమి వేడుకలు సాంసృతిక కార్యాక్రమాలు, కోలాటాలు ఆహుతులను అలరించాయి. నిన్న ఉదయం . శ్రావణ శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మీ వ్రత కుంకుమ పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించడంతో ఆలయ ప్రాంగణం భక్తిశ్రద్ధలతో నిండిపోయింది. పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా వరలక్ష్మీ వ్రతంలో పాల్గొన్న మహిళా భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో చీర, రవికతో పాటు లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. భక్తులకు దేవస్థానం వారు చక్కటి ఏర్పాట్లు చేశారు
