సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శనివారం ఏపీ సీఎం క్యాంప్ కార్యాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించిన చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 12వ PRC నియామకానికి అంగీకరించిన సీఎం చంద్రబాబు.. 2026 అక్టోబర్ నుంచి రెండు డీఏల చెల్లింపునకు ఆమోదం తెలిపారు. అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ జనవరి- 2027 నుంచి ఇచ్చేందుకు నిర్ణయించారు. తాజా నిర్ణయాల కారణంగా ప్రభుత్వానికి ఏటా రూ.2880 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. . విలేకర్ల సమావేశంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ.. ముఖ్యమంత్రితో భేటీ సందర్బంగా చర్చించిన విషయాలు, మీడియాకు వెల్లడించారు.
