సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల పాన్ ఇండియా, పాన్ వరల్డ్ లెవెల్‌లో విడుదలైన ‘టాక్సిక్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని మూటగట్టుకొంది.ఒక క్లాసికల్ లుక్ తో శృంగార సన్నివేశాలు ,తాగుడు, అర్ధం పర్ధం లేని క్రైమ్ సినిమాగా మిగిలిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా 1000 కోట్ల కలెక్షన్స్ టార్గెట్ తో విడుదలయి కేవలం 200 కోట్లు దాటటం కష్టమైపోయింది.. దీని ప్రభావం నేరుగా సినిమా పోస్ట్-థియేట్రికల్ డిజిటల్ బిజినెస్‌పై కూడా పడింది. మొదట్లో దీని ఓటిటి మార్కెట్ రూ. 200 కోట్లుగా ప్రచారము చేసారు. అయితే ఘోర పరాజయంతో ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం బయ్యర్లు కనీసం రూ. 30 కోట్లు కూడా ఇచ్చేందుకు ముందుకు రావడం లేదనేది తాజా సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘జీ5’ (ZEE5) మాత్రమే అత్యధిక బిడ్డర్‌గా కేవలం రూ. 30 కోట్ల సమీపంలో మాత్రమే ఆఫర్ చేస్తోందని టాక్ వైరల్ అవుతోంది. ఇదే నిజం అయితే నిర్మాతలకు భారీ నష్టాలు తప్పవు.
