సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు గురువారం అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 8వ జిల్లా కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. . ఈ సమావేశంలో లీడర్‌షిప్, జీఎస్‌డీపీ, తాగునీరు, గృహ నిర్మాణం, జలధార, జిల్లాల బెస్ట్ ప్రాక్టీసెస్‌పై సమీక్ష జరిపారు. .ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. గత 7వ కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాలను కూడా చర్చించుకుని లక్ష్యానికి చేరువ అవుదామని అన్నారు. ఈసారి లీడర్‌షిప్ అంశంపై కలెక్టర్ల సదస్సులో ప్రత్యేకంగా చర్చించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. రాష్ట్ర పునర్ని్ర్మాణంలో 27 నెలల్లో రాష్ట్ర ఆర్ధికవ్యవస్థను గాడిన పెట్టామని ప్రకటించారు. . రూ.1.40 లక్షల కోట్లు సంక్షేమానికి, రూ. 1.50 లక్షల కోట్లు అభివృద్ధికి ఖర్చు చేశామని వివరించారు. హంద్రీనీవా, వెలిగొండ ఫేజ్ -1, పోలవరం ఎడమ కాలువ, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టులు పూర్తి చేశామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికల్లా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని అన్నారు. అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డును పూర్తి చేసి గుంటూరు, విజయవాడకు రాజధానిని కనెక్టు చేశామని తెలిపారు. గ్లోబల్ డ్రీమ్ కేబినెట్లో తన పేరు వచ్చినప్పుడు, సీఈఓ సీఎం అన్నప్పుడు నేను ఇంత ఆనందించలేదని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *