సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశీయ స్టాక్ మార్కెట్ లో గత వారంలో మొదలయిన భారీ నష్టాల పరంపరకు నేడు, గురువారం బ్రేక్ పడింది. దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ సెషన్ చివర్లో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లలో ఒక్కసారిగా కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్ (0.19శాతం) పెరిగి 138.36 పాయింట్ల లాభంతో 74,902.59 వద్ద ముగిసింది. నిఫ్టీ (0.20శాతం) కూడా స్వల్ప లాభాలతో 46.30 పాయింట్లతో 23,477.80 దగ్గర స్థిరపడింది.అయితే బ్రాడర్ మార్కెట్ (మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్) ఒత్తిడిలోనే కొనసాగింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100.. 0.38శాతం క్షీణించింది. నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100.. 0.07శాతం నష్టపోయింది. కీలకమైన బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాలు లీడ్ తీసుకుని సూచీలను ఆదుకోగా, ఆటో, ఫార్మా, మెటల్ రంగాలు వెనుకపడ్డాయి.
