సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: న్యూఢిల్లీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ఆఫ్రికన్ యూనియన్ (ఏయూ) తరఫున నేడు, శనివారం ఉదయం హాజరైన ఆఫ్రికన్ యూనియన్ ఛైర్పర్సన్ బురుండి రిపబ్లిక్ అధ్యక్షుడు ఎవరిస్ట్ న్దాయిషిమియేకు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ భారత ప్రభుత్వం తరఫున ఘన స్వాగతం పలికారు. ఇంకా విదేశీ అధినేతలకు అతిధి మర్యాదలను, పర్యవేక్షించారు. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ ‘ఎక్స్’ వేదికపై స్పందిస్తూ, . గ్లోబల్ సౌత్ ఉమ్మడి ప్రాధాన్యతల సాధనలో భారతదేశం, ఆఫ్రికన్ యూనియన్ లోతైన భాగస్వామ్యంతో కలిసి పనిచేస్తున్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
