సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మున్సిపాలిటీ పరిధిలోని 4, 5వ వార్డులలో సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం, త్రాగునీరు లాంటి మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పనకు సుమారు రూ. 4 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, భీమవరం ఎమ్మెల్యే, పులపర్తి అంజిబాబు తో కలసి నేడు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ మాట్లాడుతూ.. ఎంపీ నిధులతో పాటు ప్రభుత్వ సాధారణ నిధులను సద్వినియోగం చేస్తూ భీమవరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తామని స్పష్టం చేశారు. అనంతరం స్థానిక ప్రజలతో సమావేశమైన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రాధాన్యత క్రమంలో వాటిని పరిష్కరించవలసిందిగా అధికారులను ఆయన ఆదేశించారు.
