సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవలఏపీకి తుపాను వస్తుందని భావించినప్పటికీ అది చాల ఆలస్యం అయ్యి. ప్రచండ ఎండలు తడాకా నేటి ఆదివారం వరకు చూపిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా అందిన సమాచారం మేరకు ఉత్తర అండమాన్ సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడింది.. ఇది వాయుగుండంగా బలపడి తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించనుందని అంచనా వేస్తున్నారు. ఈ నెల 22 నాటికి అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా బలపడి 23న ఉత్తరాంధ్రకు సమీపంలో తీరం దాటుతుందని తెలిపారు. నేటి ఆదివారం సాయంత్రం నుంచి కోస్తాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రేపు అంటే ఈ నెల 21 నుంచి భారీవర్షాలు కురుస్తాయన్నారు. అంతేకాదు తీరం వెంట గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందంటున్నారు.ఈ అల్పపీడనం క్రమంగా బలపడుతూ సోమవారం రోజు వాయుగుండంగా, మంగళవారం నాటికి తీవ్రవాయుగుండంగా బలపడుతుందంటున్నారు. బుధవారం ఉదయానికి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ఉందని.. 23న తీరం దాటే అవకాశం ఉందన్నారు.
