సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ ముందస్తు క్యాన్సర్ చికిత్సలో భాగంగా రోగులకు అధునాతన ఎంతో ఖరీదు అయిన జన్యు పరీక్షలు పూర్తీ ఉచితంగా చెయ్యడానికి గుంటూరు జీజీహెచ్ ప్రాంగణంలో నాట్కో క్యాన్సర్ కేర్ సెంటర్‌లో ఈ జన్యు పరీక్షల ల్యాబ్ ఈ నెల 22 నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆస్ట్రాజెనెకా, స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్‌లు కలిసి దీనిని చేపడుతున్నాయి. ఈ మేరకు ఆస్పత్రి ప్రాంగణంలోని నాట్కో క్యాన్సర్ సెంటర్‌లో రూ.2.5 కోట్లతో ప్రత్యేక జన్యుపరీక్షల ల్యాబ్‌కు అవసరమైన పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ముందగా రొమ్ము, ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగులకు అవసరమైన జన్యు పరీక్షలు చేస్తారు. క్యాన్సర్ రోగుల నుంచి శాంపిల్స్ సేకరిస్తారు.. వాటిని ప్రత్యేకంగా టెస్ట్ చేసి కణాల్లోని జన్యు మార్పులను ప్రధానంగా గుర్తిస్తారు. అనంతరం ఈ టెస్ట్ రిపోర్టుల ఆధారంగ రోగికి ఏ చికిత్స అవసరమో డాక్టర్లు నిర్ణయిస్తారు ప్రస్తుతం క్యాన్సర్ రోగుల జన్యు పరీక్షల కోసం శాంపిల్స్‌ను బెంగళూరు, ముంబైకి పంపిస్తున్నారు. ఇకపై రాష్ట్రంలోనే అధునాతన పరీక్షలు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నారు. బయట ప్రైవేటు ల్యాబుల్లో ఒక్కో పరీక్షకు సుమారు 25 వేల వరకు ఖర్చవుతుంది. అదే పూర్తి స్థాయి పరీక్షలకు రూ.75 వేల వరకు ఖర్చవుతుంది.. కానీ ఇక్కడ మాత్రం పూర్తీ ఉచితం.
