సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: సంక్రాంతి వస్తున్నాం. శివ శంకర్ వర ప్రసాద్ లాంటి వరుస 300 కోట్ల పైగా వసూళ్లు సాధించిన సినిమాలతో తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన సీనియర్ హీరో ‘విక్టరీ వెంకటేశ్], త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్నా ఆదర్శ కుటుంబం AK47 సినిమా పట్ల టాలీవుడ్‌లో భారీ క్రేజ్ ఉంది. గతంలో వెంకటేశ్ హీరోగా వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వాసు చిత్రాలకు త్రివిక్రమ్ రచయితగా అందించిన మాటలు ఎలాంటి సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భీమవరం వెటకారం మాటలతో త్రివిక్రమ్ డైలాగ్స్ వెంకీ నోట పలికితే ఆ టైమింగ్ వేరే లెవెల్ లో ఉంటుంది. మరి ఇప్పుడు ఆదర్శ కుటుంబం ఏకే 47 వారి కాంబినేషన్ లో దసరా కానుక గా ముందుగా ప్రకటించిన డేట్ ఈ అక్టోబర్ 2న కాకుండా 9వ తేదీన రిలీజ్ కానుంది. వెంకటేశ్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు కీలక పాత్రల్లో నివేదా పేతురాజ్, నారా రోహిత్ కనిపించనుండటం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *