సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల గల్ఫ్ యుద్ధం నేపథ్యంలో ..కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గతంలో పట్టణ ప్రాంతాల్లో వంట గ్యాస్ సిలిండర్ బుకింగ్ కాలపరిమితి 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులుగా ఉండేది. పెట్రోలియం మంత్రిత్వ శాఖ నేడు బుధవారం దీనిని సవరించింది. గ్యాస్ సరఫరా ఇటీవల గణనీయంగా మెరుగుపడిందని, ఇప్పుడు ఈ కాలపరిమితిని గ్రామీణ ప్రాంతాల్లో కూడా 25 రోజులకు తగ్గించారు. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), మరియు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) దీనిని తక్షణమే అమలులోకి తెచ్చాయి.అలాగే గృహాలలో ఉపయోగించే 14.2 కేజీల దేశీయ ఎల్పీజీ సిలిండర్ల ధరలలో ఎటువంటి మార్పు లేదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *