సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో ఈ వర్షాకాలంలో తొలిసారి తీవ్ర వాయుగుండం ప్రభావంతో పలు జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం తీరం దాటున్న నేపథ్యంలో విశాఖ జిల్లామరియు కాకినాడ లలో రికార్డు స్థాయిలో వర్షం పడుతుంది. భీమవరం తో పాటు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నిన్న నేడు గురువారం వర్షం కురుస్తూనే ఉంది.భారీ వర్షాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షలు, టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. నేడు, రేపు కూడా వర్షాలు కురవనున్నాయనే అంచనా ఉందని.. వివిధ జిల్లాల యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *