సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: విదేశాంగ మంత్రి జైశంకర్ ఇప్పటికే ఎన్నో సార్లు విదేశాలలో సూటిగా సుత్తి లేకుండా ఘాటు సమాధానాలు ఇస్తారని ప్రపంచానికి తెలుసు. తాజగా న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో.లైబీరియా విదేశాంగ మంత్రి సారా బెయిసోలో న్యాంటీతో కలిసి జైశంకర్ పాల్గొన్నారు. ఇద్దరు మంత్రులు తమ ప్రసంగాలు ముగించిన తర్వాత జైశంకర్‌ను పాకిస్థాన్‌కు చెందిన జర్నలిస్టు ప్రశ్నించారు. ‘పాకిస్థాన్‌లో ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడాన్ని మీ ప్రభుత్వం ఎప్పుడు ఆపుతుంది?’ అని అడిగారు. దానికి జైశంకర్ స్పందిస్తూ.. ‘ఒక టెర్రరిస్ట్ కంట్రీ కి చెందిన నువ్వు నన్ను ఎలా ప్రశ్న అడుగుతున్నావు ?‘ అంటూ బదులిచ్చారు నిజానికి జైశంకర్‌ను పాకిస్థాన్ జర్నలిస్టు ప్రశ్నించిన ఘటనకు ఒక రోజు ముందు.. ఇదే తరహాలో.. ఐక్యరాజ్యసమితి భవనంలోకి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెళ్తున్న సమయంలో ‘ఒక భారతీయ భారతీయ జర్నలిస్ట్ ఆయనను .. మీరు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం ఎప్పుడు ఆపుతారు?’ అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు షెహబాజ్ స్పందించకుండా రుసరుస వెళ్లిపోయారు.మరి మన జై శంకర్ స్టైల్ వేరుకాదా ? ఐక్యరాజ సమితి వేదికపై భారతీయ ప్రతినిధులు కాశ్మిర్ లో ఉగ్రవాద చర్యలు ఆపాలని, పాక్ దోచుకొన్న భూభాగాల నుండి బయటకు పోవాలని గట్టిగ హెచ్చరించారు.అలాగే రష్యా నుండి చమురు కొనుగోలు ఫై నాటో దేశాలు హెచ్చరికలు భారత్ పట్టించుకోదని 140 కోట్ల ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని డంకా బజాయించారు.
