సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: జపాన్ లో జరుగుతున్నా ఆసియా క్రీడలలో నేడు, శనివారం భారత మహిళల కబడ్డీ జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఉత్కంఠభరితంగా హోరాహోరీగా సాగిన ఫైనల్లో ఇరాన్‌ను 37-34తో ఓడించి ఈ ఆసియా క్రీడల్లో భారత్‌కు మూడో బంగారు పతాకం అందించింది. కీలక సమయంలో ఒత్తిడిని అధిగమిస్తూ.. చివరి వరకు పోరాట పటిమను భారత అమ్మాయిలు ప్రదర్శించారు. చిరస్మరణీయ విజయం సాధించారు పలుమార్లు ఇరాన్ ఆధిక్యంలోకి వెళ్లడంతో భారత శిబిరంలో ఉత్కంఠ నెలకొంది. అదే సమయంలో.. మ్యాచ్ ముగింపు దశలో ఇరాన్ టీమ్ చేసిన కొన్ని పొరపాట్లు కూడా భారత్‌కు కలిసొచ్చాయి.
