సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, ఆదివారం భీమవరంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేంద్ర మంత్రి, భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 138వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. దేశ భద్రత, జనగణన, భారతీయ సంస్కృతి–వారసత్వం, స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణ, యువత, క్రీడలు, స్థానిక ఉత్పత్తులు, పోషణ తదితర అంశాలను ప్రస్తావించారని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ తెలిపారు.సర్జికల్ స్ట్రైక్స్‌కు పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా 2016లో భారత సైన్యం చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్‌ను ప్రధాని గుర్తుచేస్తూ, బాలాకోట్ ఎయిర్‌స్ట్రైక్ సహా ఉగ్రవాదంపై భారత్ చేపట్టిన చర్యలను ప్రస్తావించారని తెలిపారుఅలాగే సోమనాథ్ ఆలయం, మోదేరా సూర్య దేవాలయాల చరిత్రతో పాటు తమిళనాడులో పురాతన శిల్పాలు, దేవాలయాలు, చారిత్రక ఆనవాళ్ల పరిరక్షణకు జరుగుతున్న ప్రయత్నాలను ప్రధాని ప్రస్తావించారని తెలిపారు.
