సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: గత ఆదివారం విజయవాడలోని ధర్నాచౌక్ వద్ద రాష్ట్ర సచివాలయం ఉద్యోగులు చేపట్టిన నిరసన ర్యాలీ అదుపు చెయ్యడానికి బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్న ఇన్‌స్పెక్టర్ షేక్ అహ్మద్ అలీ ఆకస్మికంగా గుండెపోటుతో మరణించారని నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పోలీస్ దర్యాప్తు లో తాజాగా నేడు, సోమవారం సీఐ అనుమానాస్పద స్థితిలో మరణించారని పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ విధులు నిర్వర్తిస్తున్న సమయంలో అక్కడే ఘటనా స్థలంలో ఉన్న కానిస్టేబుల్ సుధాకర్ చెప్పిన వాంగ్మూలం ప్రకారం . సచివాలయ ఉద్యోగులు సీఐ అలీని తీవ్రంగా నెట్టుకుంటూ వెళ్లారని.. దీంతో సీఐ కింద పడిపోయారని ఆ తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులకు గురై హార్ట్ స్ట్రోక్ వచ్చిందని కానిస్టేబుల్ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా.. సీఐ అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *