సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో ఈనెల 30వ తేదీ బుధవారం రోజున జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘ఓటు చోరు’ పేరుతో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షులు అంకెం సీతారామ్ ప్రకటించారు. భీమవరం పార్టీ కార్యాలయంలో నేడు, సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 2024 లో జరిగిన లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ కి మద్దతుగా వ్యవహరించినందుకు కేంద్ర ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును కాలరాసే చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *