సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా గోపవరంలో నేడు, సోమవారం రూ.55 కోట్లతో నిర్మించిన 220/33 కేవీ సబ్‌స్టేషన్‌ను ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, కైకలూరు కు చెందిన ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ..పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం విద్యుత్ మౌలిక వసతులను బలోపేతం చేస్తోందని అన్నారు. జిల్లాలోని ఆక్వా రైతులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ అందించేందుకు ఈ సబ్‌స్టేషన్‌ను నిర్మించినట్లు తెలిపారు. ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్‌ను కేవలం రూ.1.50కే సబ్సిడీపై అందిస్తున్నామని చెప్పారు. రాయితీపై విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం రూ.1,200 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. జోన్లతో సంబంధం లేకుండా ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీ అందిస్తున్నామని పేర్కొన్నారు.
