సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం నేటి మధ్యాహ్నం వరకు ప్రచండ ఎండలు నేపథ్యంలో.. నేటి మంగళవారం సాయంత్రం నుండి ఒక్కసారిగా మారిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రాగల మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా రాయలసీమ, కోస్తాంధ్రతో పాటు తెలంగాణలో ఈదురుగాలుల బీభత్సం ఉండబోతుంది. వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 నుంచి 4.5 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర పరిసరాల్లో సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు మరో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.రాష్ట్రంలోని నేటి రాత్రి నుండి పలు ప్రాంతాల్లో ఇవాళ అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచన ఉంది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచవచ్చు.
