సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: వచ్చే ఏడాది రానున్న గోదావరి పుష్కరాలకు పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతిపాదించిన స్నానాలు రేవుల టెండర్లు ప్రక్రియను జిల్లా ఏటిగట్టు శాఖ ప్రారంభించింది. నరసాపురం తీరంలో మొత్తం 12 స్నానాల రేవుల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలపడంతో రూ.8 కోట్ల నిధుల కేటాయింపు అంచనాతో టెండర్లు పిలిచారు. వాటిలో బియ్యపుతిప్ప, పీచుపాలెం, రేవు టెండర్ల ఇప్పటికే ఓకే అయ్యాయి. వీటికి రూ.90 లక్షలు వెచ్చించ నున్నారు. మిగిలిన 10 టెండర్లను ఈనెల 5 లోపు తెరవనున్నారు. తీరం వెంబడి రోడ్డు, రైల్వే వ్యవస్థ పెరగడంతో ఈసారి గోదావరి పుష్కరాలకు నరసాపురం వశిష్ఠ గోదావరిలో పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారని ప్రభుత్వ అంచనా.అందుకే గతంలో నరసాపురం తీరంలో 8 స్నానాలు రేవులు ఉండేవి. ఈసారి వాటిని 12కు పెంచారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న రేవులను విస్తరించనున్నారు. మొత్తం ఈ పనులకు రూ.8 కోట్లు కేటాయిం చింది. .అందులో వలంథర్ రేవును కొండాలమ్మ, అమరేశ్వర రేవులను కూడా విస్తరణతో పాటు వచ్చే భక్తులు బట్టలు మార్చుకునేందుకు ఇబ్బందులు లేకుండా డ్రెస్సింగ్ రూమ్‌లు కట్టనున్నారు.
