సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం ఒకేసారి 6 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో అనకాపల్లి, త్వత్వం, డోరతీ వంటి చిన్న చిన్న సినిమాలు ఉన్నాయి, వాటికి ప్రేక్షకుల నుండి పెద్దగా స్వాందన రాలేదు.. ఆ సినిమాలు 3 రోజులు ఆడితే సరుకు విషయం తెలుస్తుంది. అయితే రిలీజ్ అయిన వాటిలో రాజమౌళి కుటుంబం నుండి వచ్చిన డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమా ఫై మంచి అంచనాలు ఉన్నాయి అయితే ఈ సినిమా డివైడ్ టాక్ సాధించింది. ప్రేక్షకుల భారీ అంచనాలను అందుకోలేకపోయింది. ఇక తమిళనాడు సీఎం విజయ్ తనయుడు దర్శకత్వం వహించిన ‘సిగ్మా’ సినిమా రొటీన్ కథతో పర్వాలేదనిపించింది. అయితే తమిళ వాసన తెలుగువారికి పడుతుందా?. ఎంతమేర రుచిస్తుందో చూడాలి. ఇక తెల్లకాగితం సినిమా కూడా నేడు రిలీజ్ అయ్యింది. భీమవరం దగ్గర ఒక పల్లెటూరు లోని యువతి యువకుల ప్రేమ కధ .. పెళ్లి కి ముందే తప్పు జరిగితే వాటి పరిణామాలు నేపథ్యంలో తీసిన తెల్లకాగితం సినిమా యువత ను ఆకట్టుకొంటుంది. మంచి సాంగ్స్ , నీట్ ఉన్న కధనం, చక్కటి సన్నివేశాలు ఫొటోగ్రఫీ హైలైట్.. అయితే కథ యూత్ కి మాత్రమే.. అన్ని వర్గాల వారికీ నచ్చదు.. కొంత ఇబ్బంది ఉంది. ఆ సినిమా బడ్జెట్ కు పర్వాలేదు.
