సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్:. నిన్న శుక్రవారం దేశంలో ముంబయి,లో కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఇండియా కూటమి పార్టీల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు విజయవంతమ్ అయ్యాయి. దేశంలో ఎన్నికలలో ఓట్ల చోరీకి, రిగ్గింగ్ , ఓట్ల తొలగింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న జాతీయ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్‌ పదవి నుంచి దిగిపో’.. అనే నినాదాలు రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ, ‘సేవ్‌ డెమోక్రసీ’ నినాదాలతో కాంగ్రెస్, ఆమ్ అండ్ ఆద్మీ , లెఫ్ట్ పార్టీల నేతలు యువత కదం తొక్కారు ముఖ్యంగా ఢిల్లీలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి..జంతర్‌మంతర్‌ సమీపంలోని 11 మెట్రో స్టేషన్లను కూడా తాత్కాలికంగా మూసివేశారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జీ చేశారు. కీలక నేతలను మొత్తం 1,100 మందిని అరెస్టు చేశారు. దీంతో సెంట్రల్‌ ఢిల్లీ యుద్ధరంగాన్ని తలపించింది. ఇక ముంబైలో సీజేపీ ఆధ్వర్యంలో వేలమంది యువతతో నిరసన ప్రదర్శన జరిగింది. ఈ పార్కుకు వెళ్లే దారులను పోలీసులు మూసివేసినప్పటికీ నిరసనకారులను అడ్డుకోలేకపోయారు. సీజేపీ ధర్నాకు మద్దతుగా సినీనటులు షబానా ఆజ్మీ, నసీరుద్దీన్‌ షా, సంగీతకారుడు విశాల్‌ దద్లానీ, మహాత్మాగాంధీ ముని మనవడు తుషార్‌గాంధీ తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. పోలీసులు ఇంటర్నెట్‌ను నిలిపేయటంతో తమ ధర్నాను ప్రత్యక్ష ప్రసారం చేయలేకపోయామని సీజేపీ తెలిపింది. ఇకనైనా , సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ వెంటనే రాజీనామా చేయకుంటే ఢిల్లీలో జంతర్‌మంతర్‌ 2.0 నిర్వహిస్తామని సీజేపీ కన్వీనర్‌ అభిజీత్‌ దీప్కే హెచ్చరించారు.. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ దేశ ప్రజలకు ఎన్నికల వ్యవస్థపై నమ్మకం పోయేలా చేశారన్నారు.‘సీఎం ఫడ్నవీస్‌.. చేతనైతే మమ్మల్ని అరెస్టు చేయండి.అని సవాలు విసిరారు. చలో ఢిల్లీ మార్చ్‌కు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *