సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో.. రాష్ట్రంలోనే కీలకమైన చైర్ పర్సన్ సీటుగా భావిస్తున్న భీమవరంలో కూటమి నేతలలో టీడీపీ జనసేన పార్టీల మధ్య అభ్యర్థి కోసం పోటీ పెరిగింది. మరో ప్రక్క వైసీపీ ప్యూహాలు గుంభనంగా ఉన్నాయి. ఒక పక్క కూటమి ఉమ్మడి అబ్యర్థిగా టీడీపీ సీనియర్ నేత మెంటే పార్ధ సారధి అని ప్రచారం జరుగుతున్నప్పటికీ జనసేన నుండి కూడా లోపాయికారంగా ఫ్రెండ్లీ పోటీగా అభ్యర్థి రంగంలోకి దిగితే ఎట్లా? ఉంటుంది అని చాప క్రింద నీరుగా సమాలోచనలు జరుగుతున్నాయి. దీనికి తోడు జనసేనలోనే చైర్మెన్ అభ్యర్థి గా బరిలోకి దింగేందుకు ఇప్పటికే ఇద్దరు ప్రముఖులు సిద్ధంగా ఉండగా తాజగా .. భీమవరం మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి జనసేన పార్టీ నాయకులు వబిలిశెట్టి రామకృష్ణకు పోటీ చేయుటకు అవకాశం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు ఇల్లూరి లక్ష్మయ్య కోరారు. నేడు ఆదివారం భీమవరం జనసేన ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు మరియు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావు లకు రాజకీయ పార్టీలకు అతీతంగా స్థానిక ఆర్య వైశ్య ప్రముఖులతో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ సభ్యులు కలసి వెళ్లి అభ్యర్థన పత్రాన్ని అందించారు. రామకృష్ణ జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శిగా ఇచ్చిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించారని.. మేమందరం ఐక్యంగా పనిచేసి రామకృష్ణ ను గెలిపించుకుంటామని, అభ్యర్ధనని పరిగణలోనికి తీసుకోవాలని వారు కోరారు. అయితే 4 దశాబ్దాలుగా టీడీపీ పార్టీ ఆవిర్భం నుండి పార్టీ జిల్లా అడ్జక్షునిగా కూడా పలుమారులు పనిచేస్తూ ఎన్నోసార్లు ‘ఎమ్మెల్యే’ టికెట్ అడిగి భంగపడిన మెంటే పార్ధ సారథికి ఇప్పటి వరకు MLC కాదుకదా! కనీసం ఈసారి మునిసిపల్ చైర్ పర్సన్ ఎన్నికలలో కూడా టికెట్ రాకపోతే మాత్రం..?
