సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఇరాన్ యుద్ధం బూచిగా చూపించి భారతీయ స్టాక్ మార్కెట్ దారుణంగా పతనం అవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అది కొంతవరకు మాత్రమే వాస్తవం.. అయితే అసలు వాస్తవం తాజాగా వెలుగులోకి వచ్చింది, ప్రధాన కారణం విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు విపరీతంగా పెరగడమే. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPI) గత సెప్టెంబర్‌లో భారత ఈక్విటీల నుంచి ఏకంగా కనివిని ఎరుగని రీతిలో రూ. 35,860 కోట్లను ఉపసంహరించుకున్నారు. జూలై, ఆగస్టు నెలల్లో భారీగా పెట్టుబడులు పెట్టిన విదేశీ మదుపర్లు ఒక్కసారిగా యూటర్న్ తీసుకోవడం స్టొక్ మార్కెట్ కు పెద్ద దెబ్బ పడింది. భారత ఈక్విటీల్లో జూలైలో సుమారు రూ. 20,200 కోట్లు, ఆగస్టులో రూ. 29,631 కోట్లు పెట్టుబడి పెట్టారు. అయితే సెప్టెంబర్‌లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇటీవల అమెరికా బాండ్ రాబడులు పెరగడం, రూపాయి భారీగా బలహీనపడటం ఎఫ్‌పీఐలపై ప్రభావం చూపుతోంది. రూపాయి విలువ పడిపోతే భారత షేర్లలో పెట్టుబడుల నుంచి వచ్చే డాలర్ ఆధారిత రాబడులు తగ్గే పోవడం గమనించి విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకొంటున్నారు. భారత్ ఆర్ధిక శాఖ ఇప్పటికైనా తక్షణం రూపాయి బలపడేలా చర్యలు తీసుకోవాలి.
