సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ హీరోగా తోలి చిత్రనికి ‘బింబిసార’ పేమ్ మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో, అగ్ర నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ భారీ సోషియో-ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో, అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని విజయదశమి కి ప్రారంభించనుంది అని సమాచారం.. ఈ సినిమాకు సింహపు పిల్లను సూచిస్తూ ‘సింబా’ అనే టైటిల్ అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. నందమూరి బాలకృష్ణ ఈ సినిమా కధ రచనలో భాగస్వామిగా ఉండటమే కాదు.. సినిమాలో సెంకండ్ హాఫ్ లో చరిత్రలో ఉన్న ఒక మహా చక్రవర్తి పాత్రలో సెకండ్ హాఫ్ లో అదరగొట్టే ఎంట్రన్స్ ఇవ్వనున్నారని సమాచారం.ఈ మూవీలో బాలీవుడ్ సీనియర్ గ్లామర్ క్వీన్ రవీనా టాండన్ ఒక నెగిటివ్ షేడ్స్ ఉన్న కీలక పాత్రలో నటించబోతున్నారట. అంతేకాదు, సీనియర్ నటి శోభన కూడా మోక్షజ్ఞకు తల్లి పాత్రలో కనిపించనున్నారు .ఇక మోక్షజ్ఞ సరసన జోడీగా యంగ్ అండ్ ఎనర్జిటిక్ బ్యూటీ శ్రీలీల పరిశీలనలో ఉంది.
